హెచ్‌పీసీఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్!

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 12:05 PM

హెచ్‌పీసీఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్!

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వాహనదారులకు తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై అదిరిపోయే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్ కస్టమర్లు పెట్రోల్, డీజిల్‌ కొనుగోలుపై 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. అయితే దీనికోసం హెచ్‌పీ రీఫ్యూయెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా బిల్లు చెల్లించాలి. అలాగే బిల్లు చెల్లింపుపై పేబ్యాక్ పాయింట్లు గెలుచుకోవచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందొచ్చు.దగ్గరిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకుకు వెళ్లండి. కారు లేదా టూవీలర్‌కు పెట్రోల్/డీజిల్ పట్టించండి. బిల్లింగ్ తర్వాత అటెండెంట్‌కు మొబైల్ నెంబర్, కార్డు నెంబర్ చెప్పండి. లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి. రీఫ్యూయెల్ యాప్ ద్వారా బిల్లు చెల్లిస్తే 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు ప్రతి రూ.100కు 4 పాయింట్లు గెలుచుకోవచ్చు. ఆఫర్ అక్టోబర్ 31 వరకు అదుబాటులో ఉంటుంది.ఇకపోతే ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పెట్రోల్ కొనుగోలుపై అదిరిపోయే బహుమతులు అందిస్తోంది. మెగా ఫెస్టివ్ ధమాకా సేల్‌ ప్రారంభించింది. టూవీలర్, కారు యజమానులు పెట్రోల్ కొట్టించుకొని కారు లేదా స్కూటర్ గెలుచుకునే అవకాశం పొందొచ్చు. గంగా కుక్కర్లు, గిఫ్ట్ వోచర్లు కూడా లభిస్తాయి.

Untitled Document
Advertisements