ఒప్పోపై భారీ డిస్కౌంట్స్

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 12:16 PM

ఒప్పోపై భారీ డిస్కౌంట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ ఒప్పో తన రెనో 2 సిరీస్ ఫోన్లను ఆఫ్ లైన్ స్టోర్లలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి, రుణాల ద్వారా కొనుగోలు చేసే వారికి పది శాతం క్యాష్ బ్యాక్ ను అందించనుంది. ఒప్పో ఏ సిరీస్ 2020 మొబైల్స్ పై ఈ పద్ధతిన కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభించనుంది. ఒప్పో ఏ5ఎస్, రెనో, రెనో 10ఎక్స్ జూమ్, ఏ9, కే3 రెనో2 సిరీస్, ఏ సిరీస్ లను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు లభిస్తాయి. రెనో 2 సిరీస్, ఏ 2020, రెనో, రెనో 10ఎక్స్ జూమ్ లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎక్స్ చేంజ్ పై రూ.7,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఒప్పో కే3, ఏ3ఎస్ లు కొనుగోలు చేసే వారికి రూ.1,000 తగ్గింపు లభించనుండగా, ఒప్పో కే1 కొనుగోలుపై ఏకంగా రూ.4,000 తగ్గించనున్నారు.ఎక్స్ చేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లే కాకుండా ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేసేవారికి పది శాతం అదనపు తగ్గింపు లభించనుంది. ఫ్లిప్ కార్ట్ లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.అంతేకాకుండా మనదేశంలో ఒప్పో రెనో 2F సేల్ ప్రారంభమైంది. అమెజాన్ లొ, బయట ఆఫ్ లైన్ స్టోర్లలో దీనికి సంబంధించిన అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో గల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో లభించనున్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.25,990గా నిర్ణయించారు. స్కై వైట్, లేక్ గ్రీన్ రంగుల్లో ఇది లభించనుంది. ఒప్పో రెనో 2 సిరీస్ లో భాగంగా గత నెలలో ఒప్పో రెనో 2, ఒప్పో రెన్ 2Z విడుదల చేశారు. వీటిలో ఒప్పో రెనో 2 ధర రూ.36,990గా ఉండగా, 2జెడ్ ధర రూ.29,990గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ మూడు మొబైల్స్ లో ఒప్పో రెనో 2ఎఫ్ ధరే తక్కువగా ఉంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత కలర్ ఓఎస్ 6.1పై ఈ ఫోన్ పనిచేయనుంది. స్క్రీన్ సైజ్ 6.53 అంగుళాలుగా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, VOOC 3.0 ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. వెనకవైపు 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది.





Untitled Document
Advertisements