మతం కోసం గొంతును త్యాగం చేసింది

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 12:55 PM

మతం కోసం గొంతును త్యాగం చేసింది

ప్రముఖ పాకిస్తానీ జానపద గాయని షాజియా ఖుష్క్ ఇస్లాం కోసం తన వృత్తిని త్యాగం చేసింది. లాల్ మేరీ పత్, దానే పే దానా వంటి జనాదరణ పొందిన గీతాలను ఆలపించిన ఆమె తన వృత్తి జీవితాన్ని వదులుకుని శేషజీవితాన్ని ఇస్లాం సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర దేశాల నుంచి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని, అయితే మతపరమైన బాధ్యతల కారణంగా తాను వాటిని తిరస్కరించానని ఆమె మీడియాకు తెలిపారు. ఇంతకాలం తన పాటలను ప్రేమించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని, తన కొత్త బాధ్యతలకు కూడా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. సింధి, బలోచి ధట్కీ, సైరాకీ, ఉదర్దూ, కశ్మీరీ, గుజరాతీ, బ్రేల్వీ, పంజాబీ భాషలలో ఆమె పాడిన పాటలకు అపూర్వమైన ఆదరణ లభించింది. గడచిన 25 ఏళ్లుగా తన పాటలతో ఆమె తన అభిమానులను అలరించారు.

Untitled Document
Advertisements