తమను పట్టించుకోవడం లేదని కొడుకుని కోర్టుకీడ్చిన తల్లిదండ్రులు

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 11:52 PM

తమను పట్టించుకోవడం లేదని కొడుకుని కోర్టుకీడ్చిన తల్లిదండ్రులు

తల్లిదండ్రులు కన్న కొడుకుని కోర్టు మెట్లేక్కించారు. అహ్మదాబాద్ కు చెందిన ధర్మేష్ గోల్ అనే వ్యక్తి ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఓ ఉద్యోగంలో చేరాడు. అందులో అతడికి నెలకు రూ.60 వేలు జీతం వచ్చేది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి సన్యాసిగా మారాడు. ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. పైగా, వారికి వేరే ఆదాయ మార్గాలు కూడా లేవు. దీంతో ఆ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ అవసరాల కోసం నెలకు రూ.50 వేలు చెల్లించాలంటూ ధర్మేష్‌పై దావా వేశారు. తమ కొడుకు చదువు కోసం రూ.35 లక్షలు వెచ్చించామని తెలిపారు. అతన్ని బాగా చదివిస్తే మంచి ఉద్యోగం సంపాదించి తమ బాగోగులు చూసుకుంటాడని భావించామన్నారు. ధర్మేష్ ఉద్యోగం మానేసినా వివిధ సంస్థల్లో ప్రసంగాల ద్వారా రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడని తెలిపారు. ఈ కేసును విచారించిన కోర్టు.. తల్లిదండ్రులకు నెలకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. ‘‘తల్లిదండ్రుల అవసరాల కోసం భారీ మొత్తాన్ని ఆశించి పిల్లలకు శిక్ష విధించకూడదు. అలాగే, పిల్లలు తక్కువ మొత్తాన్ని చెల్లించి.. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని న్యాయమూర్తి వెల్లడించారు. అయితే, కోర్టు తీర్పుపై తల్లిదండ్రులు సంతృప్తిగా లేరు.





Untitled Document
Advertisements