ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా?

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 12:00 AM

ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా?

కష్టపడకుండా ఉన్న డబ్బును ఎలా రెట్టింపు చేయాలో అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆలోచించేవారికి ముందుగా గుర్తొచ్చేది ఇన్వెస్ట్మెంట్స్. ఇలా చేసేవారికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. కెరీర్ ఆరంభమైన తొలినాళ్లలోనే ఇన్వెస్ట్ చేయడం అలావాటు చేసుకుంటే కచ్చితంగా ఆర్థికంగా మంచి స్థాయికి ఎదగొచ్చు.ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధానంలో డబ్బు పెడితే.. ధనవంతులు కావొచ్చు. అదేలానో చూద్దాం..
*Post Office Monthly Income Scheme:
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా పరిగణించొచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. రిస్క్ చాలా తక్కువ. మీ డబ్బుకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ.1,500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు.
*National Pension System (NPS):
ఎన్‌పీఎస్ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) చూసుకుంటుంది. రిటైర్మెంట్ కోసం ఇందులో డబ్బులు దాచుకోవచ్చు. రిస్క్ ఉండదు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి.
*Public Provident Fund (PPF):
పీపీఎఫ్ స్కీమ్ చాలా పాపులర్. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ ఖాతా తెరవొచ్చు. కనీసం రూ.500తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. స్కీమ్ కాలపరిమితి 15 ఏళ్లు. ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే 7.9 శాతం వడ్డీ లభిస్తుంది.
*Bank Fixed Deposit (FD):
ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. రిస్క్ తక్కువ. 6 నుంచి 8 శాతం మధ్యలో వడ్డీ రేటు లభిస్తుంది. అయితే ఇతర సాధనాలతో పోలిస్తే బ్యాంక్ డిపాజిట్లపై తక్కువ రాబడి లభిస్తుంది.
*Senior Citizen’s Saving Scheme (SCSS):
సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. 55 ఏళ్ల వయసులో స్వచ్చంద విరమణ పొందిన వారు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎస్‌సీఎస్ఎస్ స్కీమ్ కాలపరిమితి ఐదేళ్లు. ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే 8.6 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.
*RBI Taxable Bonds;
రిజర్వు బ్యాంక్ ట్యాక్సబుల్ బాండ్లలో కూడా డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి కాలపరిమితి ఏడేళ్లు. వీటిపై 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. డీమ్యాట్ రూపంలో వీటి జారీ ఉంటుంది. బాండ్ లెడ్జర్ అకౌంట్‌లో ఇవి క్రెడిట్ అవుతాయి.
*Real Estate:
రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టడం కొత్తేమీ కాదు. రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల రెండు మార్గాల్లో లాభం పొందొచ్చు. మూలధన పెరుగుదల, అద్దె అనేవి ఇవి. కొనుగోలు చేసిన స్థలానికి డిమాండ్ పెరగడం వల్ల లాభం అర్జించొచ్చు. అలాగే అక్కడ అపార్ట్‌మెంట్లు కట్టుకొని రెంట్ ఇచ్చి ప్రయోజనం పొదొచ్చు.
*Gold:
బంగారంలో పెట్టుబడి పెట్టడం పాతకాలం నుంచి వస్తోంది. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్లకు భద్రత ఉంటుంది. డైరెక్ట్‌గా బంగారం కొనడమే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల మార్గంలో కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
*Stock Market:
ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులవైన పని కాదు. తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే మంచి రాబడి పొందొచ్చు. డీమ్యాట్ అకౌంట్ తీసుకొని షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్‌గా ఉండేలా చూసుకోండి.ప్రస్తుతం డబ్బు సంపాదనకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది భావిస్తున్నారు. డైరెక్ట్‌గా షేర్లలో ఇన్వెస్ట్ చేయడం తెలియనివారు ఫండ్స్ వైపు మొగ్గు చూపొచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. ఈక్విటీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది.





Untitled Document
Advertisements