మార్కెట్‌లో పసిడి పైకి...వెండి పతనం!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:07 AM

మార్కెట్‌లో పసిడి పైకి...వెండి పతనం!

పసిడి ధర మరింత పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.350 పెరిగింది. దీంతో ధర మళ్లీ రూ.40 వేల మార్క్‌ను దాటేసింది. రూ.40,050కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.320 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,720కు చేరింది. పసిడి ధర ధర పరిగెడితే వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. కేజీ వెండి ధర రూ.1,150 క్షీణించింది. దీంతో ధర రూ.47,500కు దిగొచ్చింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.38,700కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పైకి కదిలింది. దీంతో ధర రూ.37,500కు చేరింది.బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,150 పతనమైంది. దీంతో ధర రూ.47,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,487.75 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 17.46 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements