నిలకడగా పెట్రోల్-డీజిల్ ధర

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:10 AM

నిలకడగా పెట్రోల్-డీజిల్ ధర

దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.91 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.72.42 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదిలాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.77.52 వద్దనే కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా నిలకడగా రూ.71.70 వద్దనే ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.77.16 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.71.35 వద్దనే ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.73.27 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.41 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.78.88 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా ఎలాంటి మార్పు లేకుండా రూ.69.61 నిలకడగా కొనసాగుతోంది.





Untitled Document
Advertisements