జగన్ కి ధీటైన సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:29 AM

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలే గడిచినా అప్పుడే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

అయితే తాజాగా జగన్ ప్రభుత్వానికి జనసేనాని ఒక సవాల్ విసిరింది. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్ రైతులను మోసం చేశారని ఆరోపణలు చేస్తూ, జగన్ ఎన్నికల సమయంలో రైతులకు ఏటా తామే 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలు కలుపుకుని ఈ విషయం తెలియకుండా జనాన్ని మభ్యపెట్టేందుకు 1000 రూపాయలు అదనంగా పెంచి 13,500 ఇస్తామని చెప్పాడం ఎంతవరకు సమంజసం అని నిలదీసింది. మీరు హామీ ఇచ్చిన 12,500, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000లు కలిపి మొత్తం రైతులకు 18,500 రూపాయలు ఇవ్వాలని కోరింది. అయితే రైతు భరోసా అసంపూర్తిగా ఉందని సరిగ్గా అమలు చేయాలని లేదంటే ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ విసిరారు.





Untitled Document
Advertisements