బ్యాట్ తో మళ్ళీ మైదానంలో మెరవనున్న సచిన్

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 08:20 AM

బ్యాట్ తో మళ్ళీ మైదానంలో మెరవనున్న సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి టీ20లీగ్‌లో మెరవనున్నాడు.భారత్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకూ జరగనున్న రోడ్ సేప్టీ టీ20 వరల్డ్ సిరీస్‌లో భారత్ లెజెండ్స్ టీమ్ తరఫున సచిన్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. సచిన్‌తో పాటు క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఐదు దేశాల టీమ్స్‌ ఈ టోర్నీలో పోటీపడుతుండగా.. భారత్‌తో పాటు శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నుంచి మాజీ ఆటగాళ్లతో ఒక్కో జట్టు రాబోతోంది.రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కి చెందిన పీఎంజీ సంయుక్తంగా ఈ ‘రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్‌’ని నిర్వహిస్తున్నాయి. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఐదు దేశాల ఆటగాళ్లు ఈ టోర్నీలో పోటీపడుతుండగా.. జట్ల పేర్లని ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్‌గా నిర్ణయించారు.టోర్నీలో ఆడే మాజీ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ముత్తయ్ మురళీధరన్ (శ్రీలంక), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక), జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా), బ్రియాన్ లారా (వెస్టిండీస్) పేర్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. ఇక మిగిలిన ఆటగాళ్లతోనూ టోర్నీ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోనే అన్ని మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీ ద్వారా లభించే ఆదాయాన్ని రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకే వినియోగించనున్నారు. భారత్‌ గడ్డపై సిరీస్ జరగనుండటంతో.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకి అవకాశం దక్కలేదు.





Untitled Document
Advertisements