అరుదైన ఘనత సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

     Written by : smtv Desk | Fri, Oct 18, 2019, 10:14 PM

అరుదైన ఘనత సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

దేశంలో అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ముకేష్ అంబాని రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలో వరుసగా 12వ సారి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈయన సందప విలువ 51.4 బిలియన్ డాలర్లు. అంబానీ ఇలా జోరుమీదుంటే.. ఆయన కంపెనీ కూడా కొంగొత్త రికార్డులతో దూసుకెళ్తోంది.ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.9 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి కన్నా ముందుగానే షేర్లు ర్యాలీ చేయడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 2 శాతానికి పైగా పరుగులు పెట్టింది. రూ.1,428 గరిష్ట స్థాయికి తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9.03 లక్షల కోట్లకు చేరింది.ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9 లక్షల కోట్ల మార్క్‌ను దాటేయడంతో దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. ఐటీ దిగ్గజ టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. అయితే రెండింటి మధ్య అంతరం బాగా పెరిగింది. గతంలో ఇరు కంపెనీలు అగ్ర స్థానం కోసం నువ్వానేనా అంటూ పోటిపడుతూ వచ్చాయి. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.7.67 లక్షల కోట్లుగా ఉంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సెప్టెంబర్ క్వార్టర్‌లో బలమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించొచ్చనే అంచనాలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో ఆర్ఐఎల్ షేర్లు దుమ్ముదులిపాయి. భారీ ర్యాలీ చేశాయి. ఇకపోతే కంపెనీ రూ.9 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించడంతో భారత్‌లో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా చరిత్రకెక్కింది.





Untitled Document
Advertisements