ట్రైన్ ప్రయాణికులకు తీపికబురు...రైళ్లలో ఇక ఎక్కువ సీట్లు

     Written by : smtv Desk | Fri, Oct 18, 2019, 11:23 PM

ట్రైన్ ప్రయాణికులకు తీపికబురు...రైళ్లలో ఇక ఎక్కువ సీట్లు

ప్రయాణీకుల కోసం ఇండియన్ రైల్వేస్ ఒక శుభవార్త తీసుకువచ్చింది. పండుగ సీజన్‌లో ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీ కోసం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ట్రైన్లలో కరెంట్ కోసం రెండు పవర్ కార్ జనరేటర్లు ఉంటాయి. వీటి నుంచి ఫ్యాన్లు, లైట్లు, మొబైల్ చార్జీంగ్ పాయింట్లు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌కు ఎలక్ట్రిసిటీ అందుతుంది. అయితే ఇప్పుడు వీటిని తీసేయనున్నారు. వీటి స్థానంలో హెచ్ఓజీ (హెడ్ ఆన్ జనరేషన్) వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్యాసింజర్లకు అదనపు బెర్త్‌లు లభించనున్నాయి.పలు రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డురొంటో ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ఇప్పటి ఈ విధంగా ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైల్వేస్ ఎక్కువ ఆదాయం రానుంది. అలాగే డీజిల్ వ్యయాలు కూడా తగ్గనున్నాయి.దీంతో పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణం చేయాలని భావించే వారికి ఇది శుభవార్తనే. ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో ట్రైన్ టికెట్ బెర్త్‌లు కూడా కన్ఫర్మ్ అవుతాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఒక్క నిర్ణయంతో మూడు ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రయాణికులకు ఎక్కువ సీట్లు, రైల్వే టికెట్ ఆదాయం పెరగడం, రైల్వేకు డీజిల్ వ్యయాలు తగ్గడం అనే లాభాలు ఉన్నాయి. ఇప్పటికే నార్తన్ రైల్వే జోన్‌లో పలు ట్రైన్లలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements