ఎస్బీఐ లింక్డ్ ఫోన్ నెంబర్ ఎలా మార్చుకోవడం?

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 08:09 AM

ఎస్బీఐ లింక్డ్ ఫోన్ నెంబర్ ఎలా మార్చుకోవడం?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు అనేక రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ సేవకు మొబైల్‌ నెంబర్‌ చాలా కీలకం. అయితే పరిస్థితులను బట్టి ఫోన్‌ నెంబర్‌ మార్చాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాంకుకు ఇచ్చిన నెంబర్‌ మారిపోతుంది. అయితే లావాదేవీలు జరపాల్సినపుడు, ఏదైనా ఓటీపీ అవసరం అయితే ఫోన్‌ నెంబర్‌ తప్పనిసరి అవుతుంది. అందువల్ల బ్యాంక్‌కు లింక్‌ అయిన నెంబర్‌ మారిపోయినపుడు దాని స్థానంలో తీసుకున్న మరో నెంబర్‌ను బ్యాంకులో తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇందుకు బ్యాంకుకే వెళ్ళాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనూ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు చేయాల్సినది.. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ onlinesbi.com కు వెళ్ళాలి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. అందులోప మై అకౌంట్స్‌ అండ్‌ ప్రొఫైల్‌లోకి వెళ్ళి డ్రాప్‌డౌన్‌ మెనూలో ప్రొఫైల్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. పర్సనల్‌ డీటైల్స్‌/మొబైల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. అందులో ఛేంజ్‌ మొబైల్‌ నెంబర్‌-డొమెస్టిక్‌ ఓన్లీ (ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్‌ సెంటర్‌)పై క్లిక్‌ చేసి కొత్త మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌ వెరిఫికేషన్‌కు ఆప్షన్‌ ఉంటుంది. తర్వాత ఓటీపీ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, కాంటాక్ట్‌ సెంటర్‌ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో నచ్చిన దానిని ఎంచుకుంటే సరి.. మొబైల్‌ నెంబర్‌ మారిపోతుంది.





Untitled Document
Advertisements