అందుకే సినిమాలు చేయను ..షాక్ లో ఫ్యాన్స్

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 03:25 PM

తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. హాట్ అందాలతో పాటు మంచి నటనను కనబరుస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.రకుల్ అందానికి యువత ఫిదా అయిపోయారు. కుర్రకారుని పరేషాన్ చేసిన రకుల్ తీసుకున్న తాజా నిర్ణయం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇక పై సినిమాలకు దూరం అవుతానంటూ పెద్ద షాక్ ఇచ్చింది రకుల్.

అయితే పూర్తిగా దూరం కావడం లేదంట .. అసలు విషయం ఏంటంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ.. `తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తగ్గించా. కావాలని కొన్ని అవకాశాలను కూడా వదులుకున్నా. ఎంతగా కష్టపడుతున్నా ఇటీవల సరైన ఫలితాలు రావడం లేదు. వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అందుకే కొంతకాలం సినీ రంగానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. ఇకపై, మంచి కథ, నచ్చిన పాత్ర అయితేనే సినిమాలు అంగీకరిస్తాన`ని రకుల్ చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements