ప్రియురాలికి హెచ్‌ఐవి అంటగట్టిన ప్రియుడు

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 04:32 PM

ఫ్లొరిడా: అమెరికాలో ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవి ఉందని చెప్పకుండా తన ప్రియరాలితో శృంగారం చేశాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2013వ సంవత్సరంలో జెంట్రీ బర్న్ అనే వ్యక్తితో ఓ అమ్మాయి డేటింగ్ చేసింది. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టు చేయించుకుంటే హెచ్‌ఐవి ఉందని తేలింది. దీంతో జెంట్రీతో మాత్రమే డేటింగ్ చేశానని, అతడికి హెచ్‌ఐవి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ జెంట్రీ తనకు హెచ్‌ఐవి ఉందనే విషయం చెప్పకుండా ఆమెతో సెక్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ముగ్గురు మహిళలతో అతడు శృంగారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మృగాడు ఎంతమంది యువతులు బ్రతుకులు ఆగం చేశాడోనని పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెంట్రీ జైలు జీవితం గడుపుతున్నాడు. లైంగిక వ్యాధులు ఉండి బయటకు చెప్పకుండా శృంగారం చేయడమనేది అమెరికాలో నేరంగా పరిగణిస్తారు. జెంట్రీతో ఎవరైనా సహజీవనం చేసి ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.





Untitled Document
Advertisements