నిమిషాల్లో లోన్...బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 09:31 PM

నిమిషాల్లో లోన్...బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

దీపావళి పండుగ దగ్గరకు వచ్చేసింది. అందరూ షాపింగ్ మూడ్‌లో ఉంటారు. ఏ అవసరమైన చేతిలో డబ్బులు ఉంటే పని పూర్తవుతుంది.ఒకవేళ చేతిలో డబ్బులు లేకపోతే ఏం చేయాలి? అందుబాటులో పలు ఆప్షన్లు ఉన్నాయి. ఆన్లైన్ లెండింగ్ ప్లాట్‌పామ్స్ ద్వారా సులభంగానే రుణం పొందొచ్చు. దీంతో దీపావళి షాపింగ్ చేసేయవచ్చు.
*Money View - బ్యాంకులు మీకు రుణం ఇవ్వకపోయినా కూడా మనీ వ్యూలో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 3 నెలల నుంచి 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. 2 గంటల్లోనే పర్సనల్ లోన్ పొందొచ్చని మనీ వ్యూ కోఫౌండర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
*MoneyTap – మనీ‌ట్యాప్ అనే ఈ ఫిన్‌టెక్ స్టార్టప్ రూ.5 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. ఎలాంటి తనఖా అవసరం లేదు. తన యూజర్లకు షాపింగ్ కార్డు, మనీట్యాప్ ఆర్‌బీఎల్ క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. యాప్ ద్వారా 4 నిమిషాల్లోనే రుణానికి సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చని సంస్థ కోఫౌండర్ అనూజ్ కక్కర్ తెలిపారు. 2 రోజుల్లో డబ్బులు అకౌంట్‌కు వస్తాయని పేర్కొన్నారు.
*Qbera – లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. క్యూబెరా ద్వారా సులభంగా కొన్ని క్లిక్స్‌తో వేగంగా రుణం పొందొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ రూ.లక్ష దగ్గరి నుంచి రూ.15 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఉద్యోగం చేసే వారు కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 24 గంటల్లో లోన్ మొత్తం వస్తుందని సంస్థ పేర్కొంది.
*RupeeRedee – కస్టమర్లు కనీస డాక్యుమెంట్లతో రుపీరెడీ ప్లాట్‌ఫామ్ ద్వారా చిన్న మొత్తంలో రుణాన్ని పొందొచ్చు. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు లోన్ లభిస్తుంది. పది నిమిషాల్లోనే రుణం లభిస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితిన్ భాసిన్ తెలిపారు.
*LoanTap – లోన్‌ట్యాప్ ప్లాట్‌ఫామ్ కూడా కస్టమర్లకు ఇన్‌స్టా రుణాలను అందిస్తోంది. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణం లభిస్తుంది. ఇకపోతే ఎర్లీ శాలరీ యాప్ కూడా కస్టమర్లకు కొన్ని నిమిషాల్లోనే లోన్లు అందిస్తోంది.





Untitled Document
Advertisements