మద్యం తాగితే రెచ్చిపోవచ్చా?

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 11:36 PM

మద్యం తాగితే రెచ్చిపోవచ్చా?

మద్యం తాగేవారి సంఖ్య రానురాను పెరిగిపోతోంది. స్నేహితులతోనూ, బంధువులతో సరదాగా మొదలుపెట్టి అది వ్యసనంగా మారిపోతుంది. అతిగా మద్యం తాగితే కిడ్నీ, లివర్ పాడైపోయి ఆరోగ్యం దెబ్బ తింటుందని డాక్టర్లు చెబుతుంటారు. మద్యం అలవాటు సెక్స్ సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని ప్రచారం ఉంది. మద్యం తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని కొందరంటే, దీనివల్ల సెక్స్ పవర్ తగ్గిపోతుందని మరో వాదన ఉంది. మద్యపానం నిజంగా సెక్స్‌ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందా..?అతి సర్వత్రా వర్జయేత్... అన్న సామెత మద్యపానానికి సరిగ్గా సరిపోతుంది. మద్యం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది నిజమే. కానీ తగిన మోతాదులో తాగితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలో మొదటిది సెక్స్ పవర్. రోజుకి 1-2 పెగ్గుల మద్యం తాగితే మగవారిలో నిజంగా సెక్స్ కోరికలు, సామర్థ్యం పెరుగుతుంది.మద్యంలో ఉండే ఆల్కహాల్ మెదడులోని డోపమిన్ అనే రసాయకాలను ప్రేరేపించి ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల శరీరంలో నూతన ఉత్సాహం కలుగుతుంది. ఇది క్రమంగా సెక్స్‌పైకి మనసు మళ్లేలా చేస్తుంది. దీంతో సెక్స్ సామర్థ్యం పెరిగి మంచి స్ట్రోక్స్‌తో రతిలో పాల్గొనేలా చేస్తుంది. అయితే ఇది రోజుకి 1-2 పెగ్గుల మద్యం తాగేవారికి మాత్రమే కలిగే ప్రయోజనం. అతిగా మద్యం తాగితే మెదడు నుంచి డోపమిన్ రసాయకాల విడుదల తగ్గిపోతుంది. దీంతో మనిషి డల్‌గా అయిపోతాడు. డోపమిన్ తగ్గడం వల్ల డిప్రెషన్ కూడా కలుగుతంది. అతిగా మద్యం తాగేవాళ్లలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇదే కారణం. అందువల్ల రోజూ తగిన మోతాదులో మద్యం తాగితే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.





Untitled Document
Advertisements