సామజవరగమనా... @ 700,000 లైకులు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 12:01 PM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విడుదలకు వంద రోజులకు పైగా ఉండగానే సామజవరగమనా.. పాట విడుదల చేశారు. ఆ పాట ఎంతటి సెన్షేషనల్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సామజవరగమనా పాట యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాట రిలీజయిన కొన్ని రోజుల పాటు యూ ట్యూబ్‌లో నెం1 గా ట్రెండింగ్ అయ్యింది.

ట్యూన్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ పాటను బాగా ఆదరిస్తున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి.. సిడ్ శ్రీరామ్ వాయిస్ ప్రాణంగా నిలిచింది. ఇక తమన్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ సాధించింది. ఇక లైక్స్‌లో కూడా సామజవరగమన సాంగ్ సంచలనాలు రేపుతుంది. తాజాగా దీనికి 700,000 లైకులు వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగు పాటల్లో ఈ స్థాయి రికార్డు లేదు. మరికొన్ని రోజులు ఇదే దూకుడు కొనసాగితే ఈ బన్నీ సినిమా సాంగ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.





Untitled Document
Advertisements