బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 05:00 PM

బిగ్‌బాస్‌ చివరి దశకు వచ్చేసింది. ఇక వీకెండ్‌లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. నామినేషన్‌ టాస్క్‌నే మళ్లీ ఆడించాడు. ఇంట్లో ఎవరి పొజిషన్ బట్టి వారు నెంబర్స్‌ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2, రాహుల్‌..4, బాబా భాస్కర్‌, వితిక..3, వరుణ్‌ 7 స్థానాలను ఇచ్చుకున్నారు.ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్‌ టాస్క్‌ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్‌లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్‌ గిఫ్ట్‌ను రాహుల్‌ ఓపెన్‌ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్‌ అయింది. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్‌ అక్క శోభన బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అలీ చేతుల మీదుగా బాబా సేవ్‌ అయ్యారు.

శ్రీముఖి, రాహుల్‌ ,బాబా భాస్కర్‌ సేవ్‌ అయ్యారు. శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్‌ప్రైజ్‌ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్‌కు ఓటు వేసింది. అనంతరం అలీ స్నేహితుడు యాంకర్‌ రవి షోలో పంచ్‌లు పేల్చుతూ ఎంటర్‌టైన్‌ చేశాడు. రాహుల్‌ మిత్రుడు.. సింగర్‌ నోయెల్‌ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక వచ్చిన వారిలో ఎక్కువమంది అలీ, వితికలు టాప్‌ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే శ్రీముఖి, రాహుల్‌ల మళ్ళీ గొడవకు దిగారు. బిగ్‌బాస్‌ షోకు తనను శ్రీముఖే రికమెండ్‌ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్‌ నాగార్జున కు కంప్లైంట్ చేసింది. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. 'రికమెండ్‌ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు' అని శ్రీముఖి చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ రాహుల్‌ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే షో నుంచి వెళ్లిపోతానంటూ ఛాలంజ్ చేసాడు.





Untitled Document
Advertisements