సిఎం జగన్ ఇంటికి సమీపంలో పేలుడు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 05:19 PM

గుంటూరు : తాడేపల్లిలోని ఎపి సిఎం జగన్ ఇంటికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పైడమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో పైడమ్మను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ లో ఉన్న ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆ ఇల్లు ధ్వంసమైంది. ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.





Untitled Document
Advertisements