రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీలు...కళ్లుచెదిరే బంపరాఫర్లు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 06:57 PM

రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీలు...కళ్లుచెదిరే బంపరాఫర్లు

దేశీ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ వన్‌ప్లస్ కంపెనీతో జతకట్టింది. దీంతో కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ రిటైల్ షాపుల్లో వన్‌ప్లస్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ1, వన్‌ప్లస్ టీవీ టీవీ 55 క్యూ1 ప్రో టీవీలు రెండూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ముంబైలోని ప్రభాదేవీలో ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో వన్‌ప్లస్ టీవీలను ఆవిష్కరించారు. రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బేడ్, రిలయన్స్ డిజిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ అండ్ సీఎంవో కౌశల్ నర్వేకర్, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి తారా సుతారియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.‘ఇండియన్ కన్సూమర్లకు, లేటెస్ట్ టెక్నాలజీకి మేం వారధిగా ఉంటాం. ఆధునాతన సాంకేతికతను తొలిగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే మా సంప్రదాయాన్ని కొనసాస్తున్నాం. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ టీవీలను రిలయన్స్ డిజిటల్ కుటుంబంలోని ఆహ్వానిస్తున్నాం’ అని బ్రియాన్ బేడ్ తెలిపారు.రిలయన్స్ డిజిటల్‌తో గతేడాది నవంబర్ నుంచి కలిసి ప్రయాణిస్తున్నామని, తమ ప్రొడక్టులకు వస్తున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందని వికాస్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 350కి పైగా రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రిలయన్స్ డిజిటల్ తమ ఫేవరెట్ టెక్నాలజీ స్టోర్ అని తారా సుతారియా పేర్కొన్నారు.ఇకపోతే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ రెండు వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ1లో, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ1 ప్రో అనేవి ఇవి. వీటిల్లో 4కే క్యూఎల్ఈడీ, డాల్బే విజన్ సపోర్ట్, 8 స్పీకర్లు, కస్టమ్ గామా కలర్ మ్యాజిక్ ప్రాసెసర్, వన్‌ప్లస్ కనెక్ట్ యాప్ వంటి పలు పీచర్లు ఉంటాయి.అంతేకాకుండా వన్‌ప్లస్ టీవీల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్లు కూడా పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, అదనపు వారంటీ, మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీలను రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.69,900 నుంచి ప్రారంభమౌతోంది.





Untitled Document
Advertisements