జల్సాలకు ఐదేళ్లలో దాదాపు 32 కోట్లు ఖర్చుచేసిన సీఎం మేనల్లుడు!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 08:52 PM

జల్సాలకు ఐదేళ్లలో దాదాపు 32 కోట్లు ఖర్చుచేసిన సీఎం మేనల్లుడు!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. బోగస్ కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి భారీగా రుణం పొంది మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో కమల్‌నాథ్ బంధువులపై ఆరోపణలు వెలువెత్తగా ఇందులో కమల్‌నాథ్ మేనల్లుడు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే అమెరికాలో ఒక్క రాత్రి గడిపేందుకు రతుల్ పురి 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.70 కోట్లు) ఖర్చు చేసినట్టు పేర్కొంది.యూఎస్‌లోని నైట‌్‌క్లబ్‌లో ఆయన విలాసవంతంగా గడిపారని తెలిపింది. రతుల్‌తో పాటు మోసర్ బేర్ ఇండియా అధికారుల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ‘భారత్‌తో పాటు విదేశాల్లోని విలాసవంతమైన హోటల్‌లో రతుల్ గడిపారు.. అమెరికాలోని ప్రొవోకాటియర్ అనే నైట్ క్లబ్‌లో ఒక్క రాత్రి గడిపిన ఆయన 11,43,980 డాలర్లను ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల పరిశీలన పూర్తయింది’ అని ఈడీ వెల్లడించింది.అంతేకాదు, నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2016 మధ్య రతుల్ వ్యక్తిగత ఖర్చు 4.5 మిలియన్లకుపైనే ఉందని కూడా తెలిపింది. బోగస్ సంస్థలను సృష్టించి మొత్తం రూ. 8 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఈడీ పేర్కొంది. బినామీ కంపెనీల ద్వారా నిధులను తమ సొంతానికి వాడుకున్నారని తెలిపింది. మోసర్ బేర్ తరఫున అనుబంధ సంస్థలు, సహాయ కంపెనీల్లో రూ. 8,002 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని చెబుతూ ఢిల్లీ కోర్టులో 110 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది.మోసర్ బేర్ సంస్థ, డైరెక్టర్లు, ప్రమోటర్లు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించివ వాటిని దుర్వినియోగం చేశారని, స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. మోసర్‌బేర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో రతుల్ పూరి వందల కోట్లు పక్కదారిపట్టించారని తెలిపింది. అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలోనూ పూరి నిందితుడిగా ఉన్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఆగస్టు 20న అరెస్టయిన రతుల్.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.





Untitled Document
Advertisements