డికాక్‌ కాళ్ళమీద పడ్డ భారత అభిమాని..కోహ్లీ, గవాస్కర్ సీరియస్

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 09:15 PM

డికాక్‌ కాళ్ళమీద పడ్డ భారత అభిమాని..కోహ్లీ, గవాస్కర్ సీరియస్

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో ఓ అభిమాని నేరుగా మైదానంలోకి దూసకొచ్చాడు. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నా అభిమానులు ఏకంగా పిచ్‌లోకి దూసుకు రావడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ అభిమాని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ వద్దకు దూసుకొచ్చాడు. ఇదే సమయంలో డికాక్‌ను గట్టిగా కౌగిలించేందుకు ప్రయత్నించాడు. కాగా, ఈ సమయంలో భద్రత సిబ్బంది ఆ అభిమానికి పట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో అతను పట్టువీడకుండా డికాక్‌ను కలిసేందుకు ప్రయత్నించగా అభిమానికి భద్రత సిబ్బంది దేహశుద్ధి చేశారు. మరోవైపు ఈ సంఘటనపై సౌతాఫ్రికా క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అభిమానుల తీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా క్రికెట్ వ్యాఖ్యతలు గవాస్కర్, మంజ్రేకర్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements