తేలిగ్గా అరిగేది తింటే మంచిది!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 11:16 PM

తేలిగ్గా అరిగేది తింటే మంచిది!

వాతావరణ మార్పు బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఇందులో భాగంగానే వర్షాకాలంలో తీసుకునే ఆహారం తేలిగ్గా ఉండాలి. అలాగే సులభంగా అరిగేలానూ ఉండాలే చూడాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఆకలి, జీర్ణశక్తి పనితీరు మందగిస్తాయి. కాబట్టి తేలిగ్గా అరిగే పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలు అసలు తీసుకోకూడదు. కూరగాయలను ఉడికించి తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఇంకా సూప్‌ల రూపంలో కూరగాయలను తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆలుగడ్డ, కందగడ్డ, చామగడ్డ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో శొంఠి, అల్లం, జీలకర్ర, మిరియాలు, వాము వంటివి చేర్చుకుంటే అజీర్తి సమస్య ఎదురవ్వదు. ఇవన్నీ కఫం పెరగకుండా, అతిసారం రాకుండా చేస్తాయి. రోజూ కొద్దిగా తేనె తీసుకుంటే కఫం సంబంధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా స్ట్రీట్ సైడ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా వండిన ఆహారం తింటే అతిసారం, టైఫాయిడ్‌, కామెర్లు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే సరిపోదు, బయట దొరికే ఫాస్ట్​ఫుడ్​, కూల్​ డ్రింక్స్​, సోడాలు.. మొదలైన జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.అలాగే అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు.





Untitled Document
Advertisements