మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించిన రాష్ట్రపతి

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 06:16 AM

మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించిన రాష్ట్రపతి

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మహాత్మాగాంధీ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆదివా రం ఆవిష్కరించారు. మనీలాలోని మిలియం కాలేజీలో సెంటర్ ఫర్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఆగ్నేయాసియాలో తన ఐదు రోజుల పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిమను భారత దేశం మీకు బహుమానంగా అందించినప్పటికీ మహాత్మాగాంధీ అన్ని సమాజాలకు అన్ని సంస్కృతులకు అంతమంది ప్రజలకు చెందినవారని రాష్ట్రపతి అభివర్ణించారు. సాహసవంతుడైన జోస్ రిజాల్ జన్మించిన ఈ భూమిలో మహాత్మాగాంధీ కి కూడా సమాన గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఇద్ద రూ శాంతి, అహింసల్లోని శక్తి పై నమ్మకం కలిగిన వారని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements