దేశీయ మూలధన మార్కెట్లో ఎఫ్‌పిఐల పెట్టుబడులు రూ.5,072 కోట్లు

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 06:26 AM

దేశీయ మూలధన మార్కెట్లో ఎఫ్‌పిఐల పెట్టుబడులు రూ.5,072 కోట్లు

అక్టోబర్ ప్రారంభం నుంచి దేశీయ మూలధన మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) దాదాపు రూ.5,072 కోట్లు పెట్టుబడి పెట్టారు. గత నెల అంటే సెప్టెంబర్‌లో ఎఫ్‌పిఐలు దేశీయ మూలధన మార్కెట్లో రూ.6,557 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీనికి ముందు జూలై, ఆగస్టులలో ఎఫ్‌పిఐల అమ్మకాలే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి 18 మధ్య ఎఫ్‌పిఐలు షేర్లలో రూ.4,970 కోట్లు, డెబిట్ మార్కెట్లో రూ .102 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ విధంగా ఎఫ్‌పిఐ నికర పెట్టుబడి రూ .5,072 కోట్లుగా ఉంది.సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా మాట్లాడుతూ, ప్రభుత్వం డిఎ పెంచడం, కార్పొరేట్ పన్నును తగ్గించడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనం, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా దేశీయ డిమాండ్‌ను మెరుగుపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టింది. దీని ద్వారా భారత్ పట్ల విదేశీ పెట్టుబడిదారులను దృక్పథంలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. బ్రెగ్జిట్, అమెరికాచైనా వాణిజ్య చర్చలపై సానుకూల అంశాల ద్వారా పెట్టుబడిదారుల మనోభావాలు బలపడ్డాయని కార్వి స్టాక్ బ్రోకింగ్ విశ్లేషకుడు అరుణ్ మంత్రి అన్నారు.





Untitled Document
Advertisements