ప్రాంతీయ భాషల్లో హెచ్‌డిఎఫ్‌సి వెబ్‌సైట్

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 06:30 AM

 ప్రాంతీయ భాషల్లో హెచ్‌డిఎఫ్‌సి వెబ్‌సైట్

హెచ్‌డిఎఫ్‌సి తాజాగా తన వెబ్‌సైట్‌ను ఆంగ్లంతో పాటు ఆరు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. గృహ రుణ సమాచారం కొనుగోలుదారులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు సంస్థ ఈ సౌకర్యం అందిస్తోంది. సంస్థ వెబ్‌సైట్ ఇప్పుడు ఆంగ్లంతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు భారతీయ భాషలలో వెబ్‌సైట్ అందుబాటులో ఉన్న ఏకైక ఫైనాన్స్ కంపెనీ తమదేనని సంస్థ పేర్కొంది.ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, దీంతో ప్రాంతీయ భాషల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో, ప్రాంతీయ భాషల్లో కూడా సంబంధిత సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యమైందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సూద్ కర్నాడ్ అన్నారు. భాష, స్థానికీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసిన బిఎఫ్‌ఎస్‌ఐ రంగంలో తాము కూడా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులకు తమ ఇష్టపడే భాషలో డిజిటల్ కంటెంట్‌ను అందించడం డిజిటల్ ఇండియా ప్రచారంలో కూడా ఉందని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్‌లు ఉండటం వల్ల వినియోగదారులకు మరింత చేరువ అవుతామని అన్నారు.





Untitled Document
Advertisements