సరిహద్దుల్లో భారత్ కాల్పులు...భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 07:49 AM

సరిహద్దుల్లో భారత్ కాల్పులు...భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

పాకిస్థాన్ సైనికులు తరచూ సరిహద్దుల్లో జరుపుతున్న కాల్పులు, దీనికి ప్రతీకారంగా భారత సైనికులు ఎదురు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాల్పులతో భీతిల్లిన సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కుప్వారా జిల్లాలోని తంగ్ధర్ సెక్టార్ లో జమ్మూ కాశ్మీర్ - లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) లో భారత-పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముహమ్మద్ సిద్ధిఖ్ అనే పౌరుడితోపాటు ఇద్దరు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న తంగ్దార్‌లోని గుండిషోట్ గ్రామానికి చెందిన సిద్ధిఖ్ ఇంటి సమీపంలో షెల్ పడటంతో ఆయన మరణించాడు. పాక్ ముష్కరుల కాల్పులతో తాము భూగర్భ బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, పిల్లలు ఏడుస్తున్నారని సరిహద్దు గ్రామమైన గుండిషోట్ నివాసి ఇష్ఫాక్ అహ్మద్ చెప్పారు. పాక్ షెల్స్ పేల్చడంతో సరిహద్దుల్లోని 8 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానికులు చెప్పారు. ఈ దాడిలో ఆరు ఆవులు, పది మేకలు మరణించాయి. 744 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ వద్ద భారత-పాక్ లు 2003 నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినా, పాక్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తరచూ కాల్పులకు తెగబడుతోంది. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.





Untitled Document
Advertisements