పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా?...ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 01:57 PM

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా?...ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే!

ప్రావిడెంట్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలని భావిస్తున్నారా? అయితే ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రా కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ డబ్బులకు సంబంధించిన అన్ని విషయాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) చూసుకుంటుంది. రిటైర్మెంట్ తర్వాతనే ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోగలం. అయితే పదవీ విరమణ కన్నా ముందుగా కూడా పీఎఫ్ డబ్బుల్ని కొంత మేర విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందుగానే పీఎఫ్ డబ్బుల్ని తీసుకుంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం పోయినప్పుడు, పెళ్లి, చదువు, అనారోగ్యం, లోన్ రీపేమెంట్, ఇంటి కొనుగోలు వంటి పలు అవసరాల కోసం పీఎఫ్ డబ్బుల్ని ముందుగానే తీసుకోవచ్చు. ఈపీఎఫ్ డబ్బుల కోసం విత్‌డ్రా చేసుకున్న వారు క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ పోర్టల్ www.epfindia.gov.in కు వెళ్లి స్టేటస్ తెలుసుకోవచ్చు. పోర్టల్‌లోకి వెళ్లిన తర్వాత అవర్ సర్వీసెస్‌ మెనూలోని ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత మెంబర్ పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత మెంబర్ ఐడీ ఎంచుకోవాలి. అటుపైన వ్యూ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మెంబర్ ఐడీ పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూడొచ్చు. ఇకపోతే గత నెలలో ఈపీఎఫ్‌వో 8.65 శాతం వడ్డీ రేటును నోటిఫై చేసింది. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు ఇప్పుడు ఎక్కువ వడ్డీ లభిస్తుంది.





Untitled Document
Advertisements