150 కోట్లతో మెగాస్టార్ మూవీ..!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 04:43 PM

రీసెంట్ గా వచ్చిన సైరా సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి దసరా రోజున కొరటాల శివ సినిమా ముహుర్తం పెట్టాడు. ఈ మూవీని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుందని టాక్.. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ప్రయోగాలు చేస్తున్నాడు. పదేళ్లు గ్యాప్ వచ్చినా తన మార్కెట్ తగ్గలేదని గుర్తించి బడ్జెట్ విషయంలో కూడా లెక్క చేయట్లేదు. కొరటాల శివ ఇదవరకు సినిమాలు 70 కోట్ల లోపే తెరకెక్కాయి కాని చిరు సినిమాను మాత్రం 150 కోట్లు పెడుతున్నాడట. అంటే ఈ సినిమా కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తుంది.





Untitled Document
Advertisements