కల్కీ ఆస్తులపై ఐటీ దాడులు..ఎంత నగదు సీజ్ చేసారో తెలుసా

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 06:11 PM

కల్కీ భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయకుమార్, ఆయనకు చెందిన ఆశ్రమాలు, ఆస్తులు, కుమారుడి ఆస్తులపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ సోదాల్లో నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడుతుండడంతో ఐటీ అధికారులు నోరువెళ్లబెడుతున్నారు. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు, కిలోల కొద్ది బంగారం, బండిల్స్ కొద్ది డాక్యుమెంట్లు.. ఇలా తవ్వెకొద్దీ కల్కీకి చెందిన అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తాజాగా కల్కీ కుమారుడుకి చెందిన వైట్ లోటస్‌లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. 90 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువైన డైమండ్స్, రూ.44 కోట్ల క్యాష్, రూ. 20 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇక, హవాలా రూపంలో రూ.85 కోట్లు వచ్చినట్టుగా గుర్తించిన ఐటీ అధికారులు.. లెక్కల్లో చూపని రూ.500 కోట్లపై విచారణ చేపట్టారు.

ఏకకాలంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, చిత్తూరు సహా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.. ఈ ఆపరేషన్‌లో 300 మంది అధికారులు పాల్గొనగా.. మొత్తం నాలుగు రోజుల సోదాల్లో రూ.500 కోట్లకు పైగా లెక్కల్లోకిరాని ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. అయితే, కల్కీ భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయ్‌కుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఇక, కల్కీకి భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అరబిక్ దేశాలతో పాటు కెన్యా, ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.





Untitled Document
Advertisements