మహారాష్ట్ర, హర్యాణా ఎగ్జిట్ పోల్స్...బీజేపీ క్లీన్ స్వీప్!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 07:16 PM

మహారాష్ట్ర, హర్యాణా ఎగ్జిట్ పోల్స్...బీజేపీ క్లీన్ స్వీప్!

మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. పోలింగ్ బూతుల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ఓటరు తీర్పు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైపోగా.. గెలుపుపై ఎవరికే వారే ధీమాతో ఉన్నారు. మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు సర్వేలు తెలిపాయి. బీజేపీ-శివసేన కూటమి తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సర్వేలు ఈ కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ - శివసేన కూటమి 230 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది.
*టైమ్స్ నౌ సర్వే:
బీజేపీ-శివసేన కూటమికి: 230,
కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి: 48,
ఇతరులు: 10,
(మొత్తం సీట్లు: 288).
*ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే:
బీజేపీ-శివసేన కూటమి: 166-194,
కాంగ్రెస్-ఎన్సీపీ: 72-90,
ఇతరులు: 22-34,
(మొత్తం సీట్లు: 288).
*సీఎన్‌ఎన్ న్యూస్:
బీజేపీ 243 కాంగ్రెస్ కూటమి 41, ఇతరులు 4,
బీజేపీ-శివసేన కూటమి: 243,
కాంగ్రెస్-ఎన్సీపీ: 41,
ఇతరులు: 4,
(మొత్తం సీట్లు: 288).

మహారాష్ట్రలో 288, హర్యాణాలో 90 స్థానాలకు సోమవారం (అక్టోబర్ 21) పోలింగ్ జరిగింది. 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలతో పాటు మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 44 శాతం, హర్యాణాలో 52 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. అప్పటికే క్యూ లైన్‌లో నిల్చున్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.





Untitled Document
Advertisements