మద్యం మత్తులో రైల్లోనే శృంగారం...సీసీటీవీ ఫొటేజ్ లీక్

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 09:18 PM

మద్యం మత్తులో రైల్లోనే శృంగారం...సీసీటీవీ ఫొటేజ్ లీక్

మద్యం మత్తులో ఉన్న ఓ జంట రైల్లోనే శృంగారంలో తేలిపోయారు. అయితే వారి చేసేది అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు కావడంతో చిక్కుల్లో పడ్డారు. ఆ జంటను పట్టుకోడానికి పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అసభ్య ఘటన స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో నుంచి ఎడిన్బర్గ్‌కు వెళ్లే రైలులో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ జంట ఖాళీగా ఉన్న రైలు బోగీలోకి ప్రవేశించారు. ఎవరూ చూడటం లేదనే ధైర్యంతో శృంగారంలో మునిగి తేలారు. అయితే, వీరి పాడుపనిని రైల్లో ఉన్న సీసీటీవీ కెమేరాలు చూసేశాయి. ఆ వీడియోలను స్కాట్ రైల్వే‌కు చెందిన సిబ్బంది సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారి అధికారులకు సైతం చేరాయి. దీంతో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో ఉన్న జంటపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్లో ఈ వీడియోను పోస్టుచేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా దేశాలు బహిరంగ ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ఘటనలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి.





Untitled Document
Advertisements