జీవితంలో ఎదగడానికి పాటించాల్సినవి…

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 05:19 AM

‘ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆలోచించాలి తప్ప.. ఆలోచిస్తూ పనులు చేయడం వల్ల సమయం వృథా అవుతుంద’ని చెబుతారు. అంతేకాదు ఆలోచన లేకుండా చేయడం వల్ల కూడా సమయం వృథా అవుతుంది. అలాంటివే ఇవి..
విషయాలు:
మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేతప్ప.. మనకు జరిగే మేలు ఏమీ ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.
ఎదురు చూపులు:
కొత్త కొత్త ఆలోచనల వల్ల పనిలో విజయాలు సాధించవచ్చు. కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి.. ఏదో సలహా ఇస్తారని ఎదురు చూడటం అనవసరం.
పనులు:
అన్ని పనులు సొంతంగా చేసుకోవడం ఉత్తమం. సహాయం కోసం ఎదురుచూడటం వల్ల సమయం వృథా. పనిలో ఎదుటి వాళ్ల సలహాలు తీసుకోవాలి తప్ప.. వాళ్ల సలహాలు, సూచనలతో పనులు పూర్తి చేయాలనుకోవడం తప్పు.
ఆలోచనలు:
మన పని మనం చేస్తూ.. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో మన పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించాల్సిన పని లేదు.
జీవితం:
మన జీవితం మనకు నచ్చినట్టు ఉండాలి. కాబట్టి మనకొచ్చే ఆలోచనలకు అనుగుణంగా చేసే పనులు ఉండాలి. లేదంటే జీవితంలో విజయం సాధించడం కష్టం.
భయం:
లేనిపోని భయాలు ఉంటే జీవితం ముందుకు సాగదు. కాబట్టి భయాన్ని వదిలి.. చేయాల్సిన పనులు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది.
స్పందన:
చెడు జరిగినప్పుడు స్పందించాలి తప్ప.. ఎదుటివాళ్లకు ఫిర్యాదు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు.
ఒత్తిడి:
మనం తీసుకునే నిర్ణయాలే ఫలితాలను నిర్ణయిస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలతో ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి లేని జీవితం సొంతమవుతుంది.
మెప్పించడం:
ప్రతి ఒక్కరినీ మెప్పించడం దాదాపుగా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒక్కో మనిషికీ ఒక్కో మనస్తత్వం, ఒక్కో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇతరులను ఎలా మెప్పించాలా? అని ఆలోచించడం అనవసరం.
పోలిక:
ఇతరులతో పోల్చుకోవడం అనేది అనవసరమైన పనుల్లో ఒకటి. దీని వల్ల జీవితంలో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా పని చేసేటప్పుడు.. ‘ఇదే పని వాళ్లు ఎలా చేస్తారా?’ అని ఆలోచించకూడదు.
తప్పులు:
చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేయడం అనేది ఒక అలవాటు. ఏదైనా పనిలో ఒకసారి తప్పు చేస్తే.. తోటి వాళ్లు అంగీకరిస్తారు. కానీ, అదే తప్పు మళ్లీ మళ్లీ చేయడం వల్ల ఎదుటివాళ్లకు మనపై నమ్మకం పోతుంది.
పర్​ఫెక్షన్​:
చేసే పనిలో పర్​ఫెక్షన్​ ఉండాలి. లేదంటే సమయంతో పాటు చేసిన పని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు సరైన ప్రణాళికలు వేసుకోవాలి.





Untitled Document
Advertisements