భారత అమెరికాల మధ్య బలమైన బంధం

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 06:56 AM

భారత అమెరికాల మధ్య బలమైన బంధం

భారత అమెరికాల మధ్య బందం మరింత బలంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చని భావిస్తున్న తరుణంలో విదేశాంగమంత్రి ఈ వ్యాఖ్య చేశారు. ఇక్కడ అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో మాట్లాడుతూ జై శంకర్ ‘అమెరికా తన విదేశాంగ విధానానికి అనుగుణంగా వాణిజ్య వ్యవహారాల్ని రూపొందించుకుంది. అందువల్ల కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కానీ నేడు భారత్ అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఏ ఆటంకం ఎదురైనా రెండు దేశాల బంధాన్ని ఏమీ చేయలేదు’ అని స్పష్టం చేశారు. సమస్యల్ని అధిగమించి, రెండు దేశాలమధ్య వాణిజ్యాభివృద్ధికి ఒక ప్యాకేజీ కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్న తరుణంలో జై శంకర్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కొన్ని ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల్ని అమెరికా విధించిన అధిక పన్నుల నుంచి మినహాయించాలని, జనరలైజ్ డ్ సిస్టం ఆఫ్ ప్రిఫెరెన్సెస్ (జిఎస్‌పి) కింద కొన్ని దేశీయ ఉత్పత్తులకు అమెరికా కల్పించిన ఎగుమతి ప్రయోజనాలను పునరుద్ధరించాలని ఇండియా అమెరికాను డిమాండ్ చేస్తోంది. అలాగే, మన వ్యవసాయ, ఆటోమొబైల్, ఆటో పరికరాలు వంటి రంగాల్లో ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించాలని కోరుతోంది. అదేవిధంగా తన వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులకు కూడా భారత్‌లో మార్కెట్ సదుపాయం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.





Untitled Document
Advertisements