సాహాకు గాయం...మైదానంలోకి పపంత్

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:11 AM

సాహాకు గాయం...మైదానంలోకి పపంత్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు‌లో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ కు గాయం అయ్యింది. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా కీపింగ్ చేస్తున్న సాహాకు గాయమైంది. దీంతో అతను మైదానం నుంచి అర్ధాంతరంగా వెళ్లి పోయాడు. అతని స్థానంలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. గతం లో వికెట్ కీపర్ గాయపడితే సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌కు ఛాన్స్ ఉండేది కాదు. కానీ, ఐసిసి అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వికెట్ కీపర్‌కు ఆ బాధ్యతలు అప్పగించే వెసులుబాటు ఉంది. దీంతో గాయపడిన సాహా స్థానం లో పంత్ వికెట్ కీపర్‌గా మైదానంలోకి వచ్చాడు. కాగా సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ వేసిన ఓ బంతి సాహాను తాకింది. అశ్విన్ వేసిన ఈ బంతిని సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ లిండే ఆడకుండా వదిలేశాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అయి సాహాను గాయపరిచింది. బంతిని అంచన వేయడంలో విఫలమైన సాహాకు తీవ్రగాయమైంది. బలంగా వచ్చిన బంతి సాహా చేతి వేళ్ల కొసలకు తాకింది. గ్లోవ్స్ ఉన్నా బంతి వేగంగా ఉండడంతో సాహా విలవిల్లాడి పోయాడు. గ్లోవ్స్ విప్పి చూడగా తీవ్ర గాయం కనిపించింది. దీంతో ఫిజియో సూచన మేరకు సాహా మైదానం విడిచి వెళ్లి పోయా డు. అంతకుముం దు సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ కూడా రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.





Untitled Document
Advertisements