ఎట్టకేలకు అమిత్ షాను కలిసిన జగన్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 12:02 PM

ఎట్టకేలకు అమిత్ షాను కలిసిన జగన్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసారు. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ నిధులు, సమస్యలతో పాటూ మరికొన్ని కీలక అంశాల గురించి విన్నవించారు. మరోవైపు అమిత్ షా పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగరం సురేష్, భరత్‌లు ఉన్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత మధ్యాహ్నం కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో జగన్ భేటీకానున్నారు. అనంతరం కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతోనూ సమావేశం అవుతారు. కేంద్రమంత్రులతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకోనున్నారు. అమిత్‌షాతో పాటూ కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారమే సమావేశంకావాల్సి ఉంది. కానీ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, బీజేపీ ఎంపీలతో అమిత్ షాకు అపాయింట్‌మెంట్‌లు ఉండటంతో వాయిదాపడింది. మంగళవారం ఉదయం ఎట్టకేలోకు అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో సమావేశమయ్యారు.





Untitled Document
Advertisements