నేటితో CISF కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు గడువు ముగింపు!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 01:00 PM

నేటితో CISF కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు గడువు ముగింపు!

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల దరఖాస్తు నేటితో(అక్టోబర్22)తో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నార్త్ ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 01.08.2019 నాటికి 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1996 మధ్య 01.08.2001 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్ స్టాండర్ట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి జీతంగా నెలకు రూ.21,700 - రూ.69,100 + ఇతర అలవెన్సులు ఉంటాయి.





Untitled Document
Advertisements