లాభాలకు బ్రేకులు...నిఫ్టీ 70 పాయింట్లకు పైగా డౌన్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:07 PM

లాభాలకు బ్రేకులు...నిఫ్టీ 70 పాయింట్లకు పైగా డౌన్!

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేకులు పడ్డాయి. ఐటీ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కంపెనీ షేరు నిట్టనిలువునా పడిపోయింది. మంగళవారం బెంచ్‌మార్క్ సూచీ బీఎస్ఈ ఇంట్రాడేలో 374 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 11,600 దిగువకు వచ్చేసింది. అయితే చివరకు సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 38,964 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 11,588 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, టైటన్, సిప్లా షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి.అదేసమయంలో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్ దాదాపు 17 శాతం కుప్పకూలింది. ఇన్పోసిస్ సీఈవో అనైతిక విధానాలు అనుసరిస్తున్నారని, దీంతో కంపెనీ లాభాలను, ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపారని గుర్తుతెలియని వారు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.





Untitled Document
Advertisements