రామ్ లీలను చైల్డ్ పోర్న్ తో పోల్చిన ప్రకాష్ రాజ్..!!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 08:35 PM

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి.. ఇటీవలే పోటీ చేసి పరాజయం పాలైన నటుడు ప్రకాష్ రాజ్. సినిమా రంగంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా, ఈ హీరో రామ్ లీల కార్యక్రమంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ లీల కార్యక్రమం మైనారిటీలకు, సమాజానికి చేటు చేస్తుందని, దాని వలన ఇబ్బందులు వస్తాయని అన్నారు. పిల్లలను పోర్న్ చూడమని ప్రోత్సహిస్తామా అని అన్నారు.

ఇది కూడా అంతే అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. రాముడు లక్ష్మణుడు, సీతను విమానంలో తీసుకురావడం.. వారికి పూజలు చేయడం వంటి వాటివలన మైనారిటీలకు ఇబ్బందులు వస్తాయని, ఇది మన కల్చర్ కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. 2018లో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హిందూ కల్చర్ గురించి ఇలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు.





Untitled Document
Advertisements