ఎల్బీ స్టేడియంలో సందడి చేయనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 08:38 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది జులై 30 న రిలీజ్ కాబోతున్నది. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కాకుండానే చరణ్ జూనియర్ లు ఒకే పాటకు స్టెప్స్ వేసే సందర్భం రాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ జూనియర్ తో కలిసి సందడి చేయబోతున్నాడు. దబాంగ్ 3 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దబాంగ్ 3 సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. సల్మాన్ ప్రమోషన్స్ అంటే డ్యాన్స్ హంగామా అంతా ఉంటుంది.

ఇక ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 2 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. దబాంగ్ డ్యాన్స్ టూర్ పేరుతో ఈ షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ కు కూడా పాల్గొనబోతున్నారు. సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారట. సల్మాన్ ఖాన్ కు చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ కార్యక్రమానికి జూనియర్ ని కూడా వచ్చేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాలతో పాటు అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ కంటే ముందుగానే ఒకే ఫ్రేమ్ లో చరణ్ జూనియర్లతో పాటు సల్మాన్ డాన్స్ స్టెప్స్ వేస్తే అది అభిమానులకు పండుగ అనుకోవాలి..





Untitled Document
Advertisements