వాట్సప్ చాట్‌ని పీడిఎఫ్‌లా మార్చడం ఎలా?

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:44 PM

వాట్సప్ చాట్‌ని పీడిఎఫ్‌లా మార్చడం ఎలా?

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తన వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. తాజాగా వాట్సప్ ముఖ్యమైన వాటిని జాగ్రత్త చేసుకోవడం కోసం పీడిఎఫ్‌ చేసి భద్రపర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. చాలా విషయాల్లో టెలిఫోన్‌ కాల్‌డేటా మాదిరిగానే వాట్సప్‌ డేటా అవసరం కావొచ్చు. లేదా కస్టమర్లతో జరిపిన చాట్‌ని బిజినెస్‌ అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి కావొచ్చు. విషయం ఏదైనా... వాట్సాప్‌ చాట్‌ని పీడిఎఫ్‌లా ఎక్స్‌పోర్ట్‌ చేయడం కోసం ముందుగా ఏ చాట్‌ని ఎక్స్‌పోర్ట్‌ చేయాలనుకుంటున్నారో ఆ చాట్‌లోకి వెళ్లాలి. త్రి డాట్‌ మెనూ మీద క్లిక్‌ చేయాలి. మోర్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి, ఎక్స్‌పోర్ట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత జీమెయిల్‌ ఎంచుకుని.. ఈమెయిల్‌ అడ్రెస్‌ ఇచ్చి ఒకే చేయాలి. ఆ తర్వాత మీ సిస్టమ్‌లోకి ఈ టెక్ట్స్‌ఫైల్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలి. డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులో మీ టెక్ట్స్‌ఫైల్‌ ఓపెన్‌ చేయాలి. తర్వాత ఎక్స్‌పోర్ట్‌ యాజ్‌ పీడిఎఫ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి, మీ ఫైల్‌ని పీడిఎఫ్‌గా మార్చుకోవాలి.





Untitled Document
Advertisements