లావా నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:50 PM

లావా నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా తాజాగా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 'లావా జెడ్‌ 41' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలతో వినియోగదారుల అన్ని సోషల్‌ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్‌ గో వంటి డేటా యాప్‌ సర్ఫింగ్‌కూ ఈ స్మార్ట్‌ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూసినప్పుడు... 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 9 పై (గో ఎడిషన్‌), 5ఎంపీ రియర్‌ కెమెరా, 1 జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 9 లెవల్‌ ఫిల్టర్లు, నైట్‌ షాట్‌, స్మార్ట్‌ స్లీప్‌, బర్స్ట్‌ మోడ్‌ ఎఫెక్ట్‌తో పాటు రియల్‌ టైమ్‌ బోకె వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3,899.





Untitled Document
Advertisements