ఫేస్‌బుక్ లో డార్క్ మోడ్‌!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:51 PM

ఫేస్‌బుక్ లో డార్క్ మోడ్‌!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో మాత్రమే అందుబాటులోకి వచ్చిన డార్క్ మోడ్‌ను ఫేస్ బుక్ లోనూ తీసుకురానుంది. మేలో జరిగిన F8 సమావేశంలో ప్రతిపాదనను బట్టి ఫేస్‌బుక్ కొత్త అప్ డేట్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ముందుగా దీనిని మొబైల్ యూజర్లకు కాకుండా, వెబ్ బ్రౌజర్లలో వాడే కొద్ది మందికి మాత్రమే ఈ డార్క్ మోడ్ తీసుకురానుంది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ వాడేందుకు వేల సంఖ్యలో అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెబ్ బ్రౌజర్ లో ఫేస్‌బుక్ లాగిన్ అవగానే కుడి వైపు ఓ అవతార్ ప్రత్యక్షమవుతుంది. వైటా లేక డార్క్ మోడా అని అడుతుంది. ఇలానే కాకుండా క్విక్ సెట్టింగ్స్‌లోనూ ఈ ఆప్షన్ మార్చుకోవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఫీచర్ రావాలంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.





Untitled Document
Advertisements