ప్రభాస్ ఉబెర్ కూల్ ఆల్ట్రా స్టైలిష్ లుక్...వైరల్ పిక్

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:54 PM

ప్రభాస్ ఉబెర్ కూల్ ఆల్ట్రా స్టైలిష్ లుక్...వైరల్ పిక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23న) వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించడానికి రెండు రాష్ట్రాల్లోని అభిమానులు సిద్ధమైపోయారు. సోషల్ మీడియాలో అయితే అప్పుడు ప్రభాస్ బర్త్ డే హంగామా మొదలైపోయింది. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనపై ఇంత అభిమానం చూపిస్తోన్న ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది.. ఆయన కొత్త ఉబెర్ కూల్ ఆల్ట్రా స్టైలిష్ లుక్. ‘బాహుబలి’లో ప్రభాస్ చాలా భారీగా కనిపించారు. కండలు తిరిగిన దేహంతో ఒక యోధుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఆ తరవాత ‘సాహో’లోనూ భారీగానే కనిపించారు ప్రభాస్. కానీ, ఈ సినిమాలో లుక్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ప్రభాస్ బాగా లావెక్కారని, కాస్త సన్నబడితే బాగుండు అని అన్నారు. అయితే, ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం ఆయన చాలా స్మార్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన కొత్త లుక్కే చెబుతోంది. ప్రభాస్ హీరోగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ కె.కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన న్యూ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ప్రభాస్ చాలా సన్నగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నారు.





Untitled Document
Advertisements