ఇన్ఫోసిస్ సిఇఒపై ఆరోపణలు...కంపెనీకి రూ.53,451 కోట్ల నష్టం

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:55 AM

ఇన్ఫోసిస్ సిఇఒపై ఆరోపణలు...కంపెనీకి రూ.53,451 కోట్ల నష్టం

ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సిఇఒపై ఆరోపణలు రావడంతో కంపెనీ మంగళవారం 17 శాతం నష్టపోయింది. దీనివల్ల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.53,451 కోట్లు కోల్పోయింది. సిఇఒ సలీల్ పరేఖ్, సిఎఫ్‌ఒ నీలంజల్ రాయ్‌లు స్వల్పకాలిక ఆదాయం, లాభాల కోసం అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నారని ఒక విజిల్‌బ్లోయర్ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కారణంగా కంపెనీ షేర్లు క్షీణించాయి. కంపెనీ స్టాక్ రూ.643.30 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో 16.21 శాతం నష్టపోయింది. ట్రేడింగ్ సమయంలో 16.86 శాతం కోల్పోయి 638.30 రూపాయలకు చేరుకుంది. నిఫ్టీలో కంపెనీ స్టాక్ 16.65 శాతం నష్టంతో రూ.640 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ 53,450.92 కోట్ల రూపాయలు తగ్గి రూ.2,76,300 కోట్లకు పడిపోయింది. విజిల్‌బ్లోయర్ ఫిర్యాదుపై సంస్థ ఆడిట్ కమిటీ స్వతంత్ర దర్యాప్తు జరుపుతుందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ఫిర్యాదులు తనకు వచ్చాయని తెలిపారు. సిఇఒ పరేఖ్ అమెరికా, ముంబై పర్యటనల గురించి కూడా ఫిర్యాదులో ఉన్నాయి. అభియోగాలు దర్యాప్తు చేస్తాం, సిఇఒ, సిఎఫ్‌ఒలను దీనికి దూరంగా ఉంచుతామని ఆయన అన్నారు. పరేఖ్, రాయ్‌లు అనైతిక పద్ధతులను అవలంబించడం ద్వారా స్వల్పకాలికంగా సంస్థ ఆదాయాన్ని, లాభాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వారు డేటాను తారుమారు చేశారని, ఆడిటర్‌ను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ‘ఎథికల్ ఎంప్లాయీస్’ పేరుతో తెలియని ఉద్యోగుల బృందం సెప్టెంబర్ 20న కంపెనీ బోర్డుకి ఒక లేఖ రాసింది. ఈ సమాచారం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇ-మెయిల్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని విజిల్ బ్లోవర్ పేర్కొంది. ఫిర్యాదుదారులు ఇన్ఫోసిస్ బోర్డుతో పాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆఫ్ అమెరికాకు కూడా లేఖ రాశారు. ఇన్ఫోసిస్‌ను యుఎస్ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేశారు.





Untitled Document
Advertisements