ఫ్రెంచ్ ఓపెన్‌లో సింధు శుభారంభం

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 06:18 AM

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ వీపీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు 21-15, 21-13తేడాతో మిషెల్లీ లీ(కెనడా)పై సునాయాస విజయం సాధించింది. 44 నిమిషాల పాటు మ్యాచ్ జరుగగా.. తొలి గేమ్‌లో ఓ దశలో 2-5తో వెనుకబడ్డ భారత ప్లేయర్ ఆ తర్వాత పుంజుకుంది. 8-8తో పాయింట్లు సమమయ్యాక వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఓ దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించడం సహా 21-15తో గేమ్‌ను తెలుగమ్మాయి సొంతం చేసుకుంది. రెండో గేమ్ సైతం హోరాహోరీగా సాగగా.. సింధు 8-10తో వెనుకబడింది. ఆ తరుణంలో దూకుడు ప్రదర్శించిన సింధు వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా జోరును కొనసాగించి ప్రత్యర్థిని అలవోకగా ఓడించింది. రెండో రౌండ్‌లో 26వ ర్యాంకర్ యే జియామిన్(సింగపూర్)తో సింధు తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు శుభంకర్ డే సైతం మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్‌లో శుభంకర్ 15-21, 21-14, 21-17తో టామీ సుగియాత్రో(ఇండోనేషియా)పై గంటా 18నిమిషాల పాటు పోరాడి మూడు గేమ్‌ల్లో విజయం సాధించాడు.





Untitled Document
Advertisements