చింత చిగురుతో థైరాయిడ్‌ దూరం

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:20 AM

చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి. . చింత చిగురును ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌ గా పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి మంచి కొలెస్ట్రా ల్‌‌ను పెంచుతుంది. ఈ చిగురు ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండడమే ఇందుకు కారణం. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్ నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరచు చింత చిగురు తింటే ఎముకలు గట్టి పడతాయి. థైరాయిడ్‌ తో బాధపడేవారు చింత చిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులకు కూడా చింత చిగురు మంచి ఔషదమట. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్‌‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.





Untitled Document
Advertisements