ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఇంధన ధరలు....!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:55 AM

ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఇంధన ధరలు....!

దేశీయ ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.86 వద్ద స్థిరంగా కదలాడింది. డీజిల్ ధర కూడా రూ.72.09 వద్దనే నిలకడగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.77.47 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.71.38 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధర నిలకడగా ఉంది. దీంతో ధర రూ.77.10 వద్దనే కదలాడుతోంది. డీజిల్ ధర కూడా రూ.71.04 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.73.22 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.78.83 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.29 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.49 శాతం తగ్గుదలతో 59.41 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.75 శాతం క్షీణతతో 54.07కు తగ్గింది.





Untitled Document
Advertisements