ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..!!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 08:40 AM

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కలం అయ్యింది. ఇప్పటి వరకు దాదాపుగా 40శాతం వరకు షూటింగ్ పూర్తయింది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏవోక ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ లుక్ రిలీజ్ చేశారు. అది హాఫ్ హాఫ్ ఫోటో. ఆ తరువాత సినిమా నుంచి అఫీషియల్ గా ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు. దసరాకు ఏదైనా లుక్ వస్తుంది అనుకుంటే అది లేదు. అక్టోబర్ 22 న కొమరం భీం జయంతి. ఈ రోజున ఈ మూవీకి సంబంధించిన ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. కానీ, ఫ్యాన్స్ ఆశలు అడియాశలుగా మారాయి. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా ట్విట్టర్ లో ఓ మెసేజ్ షేర్ చేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా 40శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ చేయటానికి సమయం చాలా తక్కువగా ఉన్నది. రాజమౌళి సినిమా అంటే పర్ఫెక్ట్ గా వచ్చే వరకు షూట్ చేస్తూనే ఉంటారు. దసరా, దీపావళి ఇలా పండుగలకు సినిమాలకు సంబందించిన స్పెషల్ లుక్స్ ను రిలీజ్ చేస్తుంటారు. కానీ, దసరాకు ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి లుక్ రిలీజ్ కాలేదు. కొమరం భీం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యూనిట్, ఎన్టీఆర్ ను కొమరం భీంగా తెరపై చూసేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొమరం భీంజయంతి రోజున కనీసం ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేస్తారని అనుకోని ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇలా షాక్ ఇస్తారా అని మండిపడుతున్నారు. ఫోటో రిలీజ్ చేయకుండా ఇలాంటి మెసేజ్ ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీ ఫోటోలు ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements