భయపెడుతున్న రానా లుక్..

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 09:34 AM

దగ్గుబాటి వారబ్బాయి రానా 'లీడర్' సినిమాతో సాఫ్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంటరైనా.. ఆ తరువాత యాక్షన్ హీరోగా అదరగొట్టాడు. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాకుండా.. దక్షిణ, హిందీ భాషల్లో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా రానాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో రానా భళ్లాల దేవుడిగా నటించి మెప్పించాడు.

ఆ తరువాత రానా చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' సూపర్ హిట్ అయ్యింది. పాలిటిక్స్ పై సెటైరికల్ గా వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఈ మూవీ తర్వాత రానా బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 26న రిలీజ్ కాబోతున్నది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. బాహుబలిలో దున్నపోతుతో ఫైట్ చేస్తే.. హౌస్ ఫుల్ 4లో తోడేలుతో ఫైట్ చేయబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో రానా గెటప్ రివీల్ అయినప్పటికీ.. తాజాగా మోషన్ పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు రానా. ఈ చిత్రంలో రానా రెండు షెడ్స్ లో కనిపించనున్నాడు. `కూకా టోలీ కా రాజా` .. `పప్పు రంగీలా` అనే రెండు రకాల గెటప్పుల్లో మెస్మరైజ్ చేయబోతున్నాడు.





Untitled Document
Advertisements